Breaking News

రాజమండ్రీ రూరల్ లో ముంపు ప్రాంతంలో కలెక్టర్ పర్యటన

-ఆక్రమణలు తొలగింపు, కల్వర్టు నిర్మాణం పై ఆదేశాలు జారీ
-ముంపు ప్రాంతాలలో శానిటేషన్ పనులు తక్షణం చేపట్టాలి
-కలెక్టర్ ప్రశాంతి

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆవా ఛానల్ నుంచి గోదావరీ నది లోకి పంపుతున్న నీరు రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి రూరల్ పరిథిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికులు నగరం లోని వృధా జలాలు ఆవా డ్రైయిన్ ద్వారా ధవళేశ్వరం సాయి బాబా టెంపుల్ వద్ద గోదావరీ లోకి పంపడం జరుగుతోందని, గోదావరి నదీ కి వరదలు సమయంలో రూరల్ మండలం లోని పలు ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నట్లు వివరించారు. క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితి ని అంచనా వేసేందుకు మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి పర్యటన చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆర్ అండ్ బి కల్వర్టు నిర్మాణం పనులను, డివిజనల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులను చేపట్టడం తో పాటు, గోదావరి పరివాహక ప్రాంతంలో, గట్టు ప్రాంతాల్లో, ఇరిగేషన్ కాలువ ప్రాంతాలలో ఆక్రమణ తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీచేసింది చేశారు.

ఆక్రమణ లని తొలగించాలని డివిజనల్ పంచాయతీ అధికారి నాగలత కు, కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ఆర్ అండ్ బి – ఈ ఈ ఎస్బివి రెడ్డి లను కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ఎంపిడివో డీ. శ్రీనివాస్, పిడి డిఆర్డిఎ ఎన్వివిఎస్ మూర్తి, స్ధానిక నాయకులు డా. గోరంట్ల శాంతారం, ఎమ్. శివ ప్రసాద్, బొప్పన నానాజీ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *