విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రజత్కార్గిల్దివాస్ 25 సంవత్సరాల విజయ్కార్గిల్దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ కార్గిల్లో ధైర్యంగా పోరాడి తమ ప్రాణాలను బలిగొన్న భారత సైన్యానికి చెందిన సైనికులను గుర్తుచేసారు. భారతీయ సైన్యంలో 30 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ సుబేదార్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, హాజరైన ఇతర అతిథులచే సత్కరించబడ్డారు. సైన్యం లో పని చెయ్యటం అంటే నిజమైన దేశ సేవ అని అన్నారు. నలందా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, NCC యూనిట్ హెడ్ సుధాకర్, ఎన్సీసీ సభ్యులు పాల్గొన్నారు. దేశం కోసం పోరాడి అసువులు బాసిన సైనికుల దినోత్సవానికి 25 వసంతాలు పూర్తి అయిన సందర్భం గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశ భక్తి ఒక్క ఆవశ్యకతను వక్తలు తెలియచెప్పారు. అనంతరం మాజీ సుబేదార్ ప్రభాకర్ ని కాకాని తరుణ్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ సత్కరించారు.
Prajavartha Online Telugu News