Breaking News

“పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అధికారులు ఆయా సమన్వయ శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించుకోవడానికి ఒక చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన “పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిష్కారం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయం చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని వాటి పరిష్కారం కోసం చక్కటి వేదిక అన్నారు. సోమవారం మొత్తం ప్రజల నుంచి 114 అర్జీలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ లో 108, ఆఫ్ లైన్ లో 6 అర్జీలు నమోదు చేసినట్లు తెలిపారు. రెవిన్యూ 43, పంచాయతీ రాజ్ – 20, హోం ( పోలిస్) 12, హౌసింగ్ 6, ఇతర శాఖలకు చెందిన 33 అర్జీలు అందాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *