Breaking News

ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణ ఆర్డీవో లు నిర్వర్తించాలి

-ఆగస్ట్ నెలలో 2,40, 595 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ఇంటింటికి పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి
-కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆగష్టు 2024 నెల పెన్షన్ పంపిణి ప్రక్రియను ఆగస్టు 1 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు.

సోమవారం ఉదయం ఎంపిడివో లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాలు జారీ చేస్తూ, జిల్లాలో 2,40,595 మందికీ రూ.102,54,77,500 ల పింఛన్ల పంపిణీని చెయ్యాల్సి ఉందన్నారు. ఆగస్టు ఒకటవ తేదీ మొదటి రోజే 99% పంపిణీ పూర్తికావలన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వడం జరగదని పేర్కొన్నారు. ఆగస్ట్ 1 , 2 తేదీల్లో పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం , బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం , సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,200 మంది సిబ్బంది ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయనుండగా అందులో సచివాలయ సిబ్బంది 3,900 మంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు 300 మంది ఉన్నట్లు తెలిపారు. పెన్షన్ పంపిణీ చేసే సిబ్బందికి 50 నుంచి 90 మంది పెన్షన్దారులను మ్యాప్ చెయ్యడం జరిగిందన్నారు. నగదును 31 న ఉపసంహరించుకుని గత నెల మాదిరిగా ఒకటవ తేదీ ఉదయం 5.00 గంటల నుంచే పంపిణీ చేపట్టి ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ల సొమ్ము పూర్తి గా అందచెయ్యలన్నారు. ఆగస్టు 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు ‘సేర్ప్’ కి తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైస్ నందు తప్పనిసరిగా పొందుపరచాలన్నారు.

గతములో ఉపయోగించి న సిబ్బందినే ఉపయోగించు కొవాలని, అవసరమైన చోట కొత్త వారిని గుర్తించి శిక్షణ ఇవ్వవలసి ఉందన్నారు. ఫింఛనుల లబ్దిదారులకు ఎన్టీయార్ భరోసా ఫింఛను బట్వాడా (Pension Disbursement Certificate) ప్రతి ఒక్క లాబ్ధిదారునికి అంద చెయ్యాలని తెలియ చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *