Breaking News

కనుల పండుగగా దేశ భక్తి ఉట్టిపడేలా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

-ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగరేసిన గౌ. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి
-డి ఆర్ డి ఎ ద్వారా 4869 మంది స్వయం సహాయక సంఘాలలోని 35,244 మంది సభ్యులకు, బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి ఉన్నతి, సి.ఐ.ఎఫ్ పథకాల లబ్ధి దారులకు రూ.250 కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి
-మెప్మాా లోని 6920 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 96 కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి పాల్గొన్నారు. మంత్రి వేదిక వద్దకు రాగానే స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. మంత్రి జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం, జాతీయ పథకానికి వందన సమర్పణ, జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ డా . ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తో ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పెరేడ్ మైదానం సందర్శించి ,పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రివర్యులు జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎం ఎల్ ఎ పులివర్తి నాని, ఎమ్మెల్సి బల్లి కళ్యాణ చక్రవర్తి, సిపాయి సుబ్రమణ్యం తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలిపే శకటాల ప్రదర్శన:

పరిశ్రమలు శాఖ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పర్యాటకశాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, తిరుపతి నగరపాలక సంస్థ, ఫాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పోలీసు జాగిలాల ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నది .

ఆకట్టుకున్న సాంస్కృతిక కళారూపాలు:

సాంస్కృతిక కార్యక్రమాలు – తిరుపతి

పులిగుండ్రం జడ్పీ హైస్కూల్ కళాశాల విద్యార్థులు సంక్రాంతి వచ్చింది తుమ్మెద గేయ నృత్య ప్రదర్శన

రేణిగుంట జడ్పీ హైస్కూల్ బాలికలు ఇది మన భారత దేశం నృత్య ప్రదర్శన

మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, తిరుపతి విద్యార్థులు వారు పిరమిడ్స్ ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తిరుపతి విద్యార్థులు బంజర గేయం

సేవ్ అవర్ సోల్ స్కూల్, ఏర్పేడు విద్యార్థులు నెత్తురు మరిగితే గేయం నృత్య ప్రదర్శన

శ్రీ శ్రీనివాస యోగా సెంటర్ తిరుపతి విద్యార్థులు యోగ ప్రదర్శన

మహాత్మా గాంధీ జ్యోతిబాయ్ పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, తిరుపతి విద్యార్థులు దేశ్ రంగీలా గేయ నృత్య ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కోయిలారే గేయ నృత్య ప్రదర్శన

సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, పోలీస్ అధికారులకు సిబ్బంది 392 మందికి మంత్రి గారు ప్రశంస పత్రాలను, పోలీస్ మెడల్స్ ను అందించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి వర్యులు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, ఎస్పీ సుబ్బరాయుడు లతో కలిసి కలిసి పరిశీలించారు.

మహిళ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ వింగ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ( డి.ఆర్.డి.ఏ), మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సూక్ష్మ నీటి సాగు పథకం శాఖ( ఏ.పి.ఎం.ఐ.పి), పట్టు పరిశ్రమల శాఖ, ఎన్టీఆర్ వైద్య సేవ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పర్యాటకశాఖ, అటవీశాఖ, పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి తిరుపతి జిల్లాకు సంబంధించిన గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించిన 4869 మంది స్వయం సహాయక సంఘాలలోని 35,244 మంది సభ్యులకు, బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి ఉన్నతి, సి.ఐ.ఎఫ్ పథకాల లబ్ధి దారులకు రూ.250 కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేశారు. మరియు మెప్మాా లోని 6920 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 96 కోట్ల రుణాలను మెగా చెక్కును మంత్రి వర్యులు జిల్లా కలెక్టర్ తో కలిసి పంపిణీ చేశారు.

ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

వ్యాఖ్యాతగా వ్యవహరించిన కృష్ణవేణి, షాజహాన్ గారికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందించారు.

కార్యక్రమాల అనంతరం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన తేనీటి విందులో గౌరవ మంత్రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్ , తిరుపతి ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి లతో పాటు పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *