-బ్రహ్మకుమారీస్, ఓంశాంతి నిర్వాహకురాలు గీతామాధురి అక్క
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షాబందు దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ వారికి సోమవారం నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు బ్రహ్మకుమారీస్, ఓంశాంతి సంస్థ నిర్వాహకురాలు గీతా మాధురి అక్క రాఖి కట్టి తమ సోదర భావాన్ని వ్యక్తపరిచారు. కమిషనర్ వారు కూడా ఈ సందర్భంగా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News