-మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా వేగవంతంగా పరిష్కరిస్తుందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ కేతన్ గర్గ్ 13 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పరిష్కారము చెయ్యాలని ఆదేశించడం జరిగిందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలు:
టిడ్కో గృహాలు, ఇంటి సమస్య, పారిశుధ్యం, పెన్షన్ లు, డ్రైనేజి, మురుగు నీరు,ఇంటి పన్ను, వీధిలైట్స్ తదితర సమస్యలు పై అర్జీ దారుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.
ఈ రోజు వచ్చిన అర్జీలు..
రాజమహేంద్రవారానికి చెందిన కేఎస్. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి ఎదురుగా జాంపేట రైతు బజార్ సమీపంలోని విజయ పాల బూత్ అనే బడ్డీ కొట్టు ను తొలగించవలసినదిగా కోరుట. దాని సమీపంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టవలసినదిగా కోరుట.
రాజమహేంద్రవరానికి చెందిన టి. రవి అనే వ్యక్తి ధవలేశ్వరం ఏపీ టిట్కో గృహాల నందు నివసిస్తున్నానని, తనతోపాటు 16 కుటుంబాల వారు రాసుకున్న రిపోర్టు ల్లో ఉన్నారని గ్రౌండ్ ఫ్లోర్ జీవన్ లో నివసిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు తమ కుటుంబాల వారిని కులం పేరుతో దూషిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుట.
రాజమహేంద్రవరానికి చెందిన వి. పద్మనాభ అనే వ్యక్తి భాస్కర్ నగర్ నందు 17వ ప్లాట్ సర్వే క్లియర్ చేయవలసినదిగా కోరుట.
రాజమహేంద్రవరానికి చెందిన బి. నాగేశ్వరరావు అనే వ్యక్తి తాను నిర్మించుకుంటున్న ఇంటికి అనుమతులు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా కోరుట
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ వినూత్న, సూపర్నెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానర్ జి.వి.ఎస్. ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News