Breaking News

ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు తీరుపై కలెక్టర్ ఎస్పీ సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రక్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి . నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు లతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానం లో వినియోగ దారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కలెక్టర్ ఎస్పి లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దిశా నిర్దేశనం చెయ్యడం జరిగిందన్నారు. ముఖ్యంగా నాలుగు అంశాలను పేర్కొన్నారని, ట్రాన్స్పోర్టర్లు అధిక చార్జీలు వసూళ్లు, మధ్యవర్తుల  ప్రమేయం, రీచ్ ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణ ల నివారణ, డిమాండు కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసే విధానం లో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాలు వివరాలు ఖచ్చితంగా ఆర్టీవో వద్ద రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు రీచ్ లకి బుకింగ్ కోసం వాహనాలను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇసుక కోసం పేర్లు నమోదు చేసేందుకు ప్రతీ రీచ్ పాయింట్ కు చెందిన సమీపంలో నిర్ణీత ప్రదేశంలో ప్రత్యెక రిజిస్ట్రేషన్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా కు పాల్పడే వాటినీ బ్లాక్ లిస్టు లో పెట్టడం ద్వారా వాటినీ ద్వారా ఎటువంటి సరుకు రవాణా చేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఇసుక రీచ్ వద్ద వాహనాలను రవాణా కు అనుమతించడం జరుగుతున్న దృష్ట్యా రీచ్ లోకి వాహనం వొచ్చి, ఇసుక లోడింగ్ చేసుకుని, తిరిగి బయటకి వొచ్చే సమయం ను అనుసరించి రీచ్ వారీగా వాహనాలకు స్లాట్ లని కేటాయించాలని ఆదేశించారు. వినియోగదారుని వివరాలు ఆధారంగా క్రాస్ చెక్ చేసే వ్యవస్థను ప్రవేశ పెట్టడం పెట్టి, గ్రామ స్థాయి లో 20 శాతం మేర క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి నివేదిక అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, బయో మెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పర్యవేక్షణా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్పీ డీ నరసింహా కిషోర్ మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం నివారించే క్రమంలో రీచ్ లలోకి కేవలం అనుమతి పొందిన వాహనాలని అనుమతిస్తామని స్పష్టం చేశారు. రీచ్ ల వద్ద ఎటువంటి క్యూ లైన్లు లేకుండా నిర్వహణా వ్యవస్థ ఉండాలన్నారు. ప్రత్యేక రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద నమోదు చేసిన వాటికి ట్రక్ షీట్ అనుసరించి మాత్రమే తనిఖీ చేసి రీచ్ లోకి అనుమతి ఇస్తామన్నారు.

ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, జిల్లా రెవిన్యూ అధికారులు జి. నరసింహులు, ఆర్డీవో లు కే ఎల్ శివ జ్యోతి, ఆర్ కృష్ణ నాయక్, ఎస్ ఈ ఇరిగేషన్ ఎస్. శ్రీనివాస రావు, మైన్స్ ఏ డీ ఎమ్. సుబ్రహ్మణ్యం ,  డి టి సి టివి కృష్ణా రావు, ఈ ఈ ఇరిగేషన్ ఆర్. కాశీ విశ్వేశ్వర రావు, డిడి గ్రౌండ్ వాటర్ వై. శ్రీనివాస్, డీఎస్పీలు, సెబి, రవాణా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *