Breaking News

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త ఎర్ర రాజు కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 51 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు యండి జాహీద్ తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరుపేద అయినటువంటి ఎర్ర రాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని జాహీద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మంగళవారం నగదును అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *