కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు ఐ. సి డి యస్ ప్రాజెక్టు పరిధిలో కొవ్వూరు నందు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ్ వారి ఆద్వర్యం లో స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బేటి బచావో బేటి పడావో లో బాగంగా డివిజన్ స్థాయి బాల్య వివాహాల నిలుపుదల మరియు బాల్య వివాహాలపై అవగాహన సమావేశము నిర్వహించడమైనది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, బాల్య వివాహాల వలన జరిగే నష్టాలు గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు బాల్య వివాహాల జరుగకుండా కమిటీలు ఏర్పరచినట్లు తెలిపారు. బాలిక విద్య పట్ల ఆసక్తి పెంచడానికి వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారితో సమావేశాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమములో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజకుమార్ కొవ్వూరు సి.డి.పి.ఓ డి.మమ్మీ బాల్య వివాహాలు, చట్టాలు గురించి వివరించినారు. ఈ కార్యక్రమం లో కొవ్వూరు డిఎస్పీ , డివిజనల్ పంచాయతీ అధికారి, కొవ్వూరు, చాగల్లు, తాళ్ళపూడి మండలాలకు చెందిన తహసిల్దారులు, ఎంపిడివో లు, ఎమ్ ఈ వో లు, పాల్గోన్నారు. కొవ్వూరు ఐ. సి డి యస్. ప్రాజెక్టు పౌష్టికాహార స్టాల్స్ ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమం లో సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News