Breaking News

వరధ బాదితుల కు బిజెపి అండ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బిజెపి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ నిర్వహించారు.అమెరికా దేశం లో కాలిఫోర్నియా లో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి విజయవాడ లో వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సూచనలు మేరకు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు.. చీర, లుంగీ, టవల్, దుప్పటి లతో కూడిన 200 కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం మాట్లాడుతూ వరద వల్ల సర్వం కోల్పోయారు.దాతల దాతృత్వం తో కొంత ఉపశమనం కలిగించే విధంగా సహకారం చేస్తున్నాం అన్నారు. అమర్నాథ్ రెడ్డి, మధుకర్ జీ చేతులు మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి నేతలు ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య,కిలారు దిలీప్, బొమ్మ దేవర రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *