Breaking News

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ఎన్డీయే కూటమినేతలంతా ఐక్యంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *