Breaking News

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 46వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన గన్నవరపు చిన్నమ్మడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. నిరుపేద అయినటువంటి గన్నవరపు చిన్నమ్ముడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ గుర్రం కొండ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, డివిజన్ టిడిపి అధ్యక్షులు దిటి ప్రభుదాస్ తో కలిసి సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *