Breaking News

వియత్నాం రాయబారి గుయెన్ థాన్ హైని కలిసిన డాక్టర్ తరుణ్ కాకాని


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలోని వియత్నాం రాయబారి గుయెన్ థాన్ హై, కన్నెగంటి విజయ్ మోహన్ నేతృత్వంలోని ఏపీటీఎఫ్ -ఏపీ  టూరిజం ఫోరమ్ మరియు అడ్వెంచర్ టూరిజం ప్రెసిడెంట్ డాక్టర్ తరుణ్ కాకాని తో కలిసి టూరిజంపై గురువారం వివరంగా చర్చించారు. ముఖ్యం గా భారత దేశం నుండి 3.92 లక్షల మంది టూరిస్ట్ లు వచ్చారని, ఇప్పుడు వియత్నాం నుండి భారతదేశానికి కూడా అదే స్థాయిలో టూరిజం ని పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని ఏపీటీఎఫ్ అధ్యక్షులు కన్నెగంటి విజయమోహన్ కోరారు. 976 చదరపు కిలోమీటర్లు తీర ప్రాంతం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వాటర్ స్పోర్ట్స్ కి , క్రూయిజ్ కి అనువైన ప్రదేశం అని ఆ రంగం లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు శ్రీనివాస్ చిట్టూరి , ప్రశాంతి , తాతరావు కూడా పాల్గొన్నారు. వియత్ జెట్ ఎయిర్ లైన్స్ ద్వారా డైరెక్ట్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసేదిశగా ప్రయత్నిస్తామని వియత్నాం వారు తెలియచేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ని బుద్దిస్ట్ సర్క్యూట్ ని తమ పౌరు ల కు తెలియచేస్తామని చెప్పారు. అమరావతి లో వైజాగ్ లో ఫామ్ ట్రిప్స్ ఏర్పాటు చేసి కామన్ కమిటీ ని కూడా ఏర్పాటు చెయ్యటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అనంతరం న్గుయెన్ గారికి విజయమోహన్ మరియు కాకాని తరుణ్ మొక్క ను అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *