Breaking News

మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా రీ ఓపెన్ కి తావులేకుండా సకాలంలో పరిష్కరించాలి

-ఈ నెల 20 వ తేది నుండి 26 వరకు జరగనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు సమిష్టి కృషితో విజయవంతం చేయాలి
-PMAY 1.0 కింద మంజూరు చేయబడిన అన్ని గృహాలు మార్చి, 2025 నాటికి పూర్తి చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా రీ ఓపెన్ కి తావులేకుండా సకాలంలో పరిష్కరించాలనీ, అలాగే ఈ నెల 20 నుంచి 26 వ తేది వరకు జరగనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పై జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని, పరిష్కరించలేని ఫిర్యాదు ఐనచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలని, ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులని ఫోన్లో సంప్రదించి మాట్లాడాలనీ తెలుపగా వర్చువల్ గా పలువురు అధికారులు స్పందిస్తూ అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకుని పరిష్కరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ కి తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి, రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలని, కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీ ఓపెన్ అయితాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పి జి ఆర్ ఎస్ ప్లాట్ఫారం ను చూస్తున్న కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేలా తగు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అందరూ అధికారులు బాధ్యతగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలని తెలిపారు.

ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 20 నుండి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులందరూ సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం జిల్లా, మండల, గ్రామస్థాయిలలో విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ పక్కా ప్రణాళికతో మునిసిపల్, మండల స్థాయిలో, గ్రామస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దూర దృష్టితో స్వర్ణాంధ్ర 2047 విజన్ అభివృద్ధి కొరకు సమగ్ర కసరత్తు చేపట్టిందని తెలిపారు.

అలాగే జిల్లాలో మంజూరైన గృహాలు అన్ని పూర్తి చేయాలని మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ నెల 28వ తేదీ ప్రభుత్వం ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమం చేపడుతుందని, ఈనెల 28న అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీల్లో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాలను , లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 24 , 25 తేదీలలో గ్రామ వార్డు సచివాలయాలలో సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో, వార్డ్ అసిస్టెంట్లతో, సంక్షేమ అసిస్టెంట్లతో టెక్నికల్ సిబ్బందితో హౌసింగ్ నిర్మాణం పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలు 2025 మార్చినాటికి పూర్తి చేయాలని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద మంజూరైన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ఈనెల 28న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ లు, గ్రామ వార్డు సచివాలయ అధికారిణి సుశీల దేవి, హౌసింగ్ పి.డి వెంకటేశ్వర్ రావు, సి.పి. ఓ వెంకటేశ్వర్లు తదితర జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *