Breaking News

ఆక్వా రైతులు సొసైటీలుగా ఏర్పాటయి ప్రభుత్వ పరమైన అన్ని ప్రయోజనాలు పొందాలి…

కృత్తివెన్ను, చిన గొల్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతులు సొసైటీలుగా ఏర్పాటయి ప్రభుత్వ పరమైన అన్ని ప్రయోజనాలు పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆక్వా రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామంలో సాయి హర్షిత్ ఆక్వా టెక్ కంపెనీ సందర్శించి రొయ్య, పండుచేప విత్తనం తయారీ పరిశీలించారు. లార్వా దశ నుంచి పోస్ట్ లార్వా తదితర దశల్లో సీడ్ పెరుగుదల, తయారీకి వినియోగించే ఫీడ్, మందులు తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చినగొల్లపాలెం సర్పంచ్ గ్రామస్తులు మత్స్యకారులు కలెక్టర్ ను కలిసి తమ సమస్యలు వివరించారు. సముద్ర మొగ పూడిక వల్ల మత్స్యకారుల జీవన ఆదాయం తగ్గిపోయిందని, మొగ పూడిక తీయించాలని, ఉప్పుటేరు కొత్త కాలువ స్ట్రైట్ కట్ డ్రెడ్జింగ్ చేసి పూడిక తీయించాలని, చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవనభృతి మంజూరు చేయాలని, మత్స్యకారులకు వలలు ఐస్ బాక్సులు, ఏరియేటర్లు మంజూరు చేయాలని, లక్ష్మీపురం పిహెచ్సిసి దూరంగా ఉందని, దీవులలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ ను కోరారు. వికసిత్ ఆంధ్ర విజన్ డాక్యుమెంట్లో డ్రెడ్జింగ్ పనుల ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులకు జీవనభృతి త్వరలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు ద్వారా వలలు, ఐస్ బాక్సులు, ఏరియేటర్స్ అందించుటకు చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ముఖ్యంగా ఆక్వా సాగుకు విద్యుత్ సబ్సిడీ అందించి పరిశ్రమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ ను కోరారు. ఆక్వా రంగంలో విద్యుత్ సబ్సిడీ అందించుటకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ గరిసపూడి వద్ద వెనామి రొయ్యల చెరువు సాగు పరిశీలించారు. అనంతరం గరిసపూడి అండర్ టన్నెల్ వద్ద పండుగప్ప చేప కేజ్ కల్చర్ పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా మత్స్యశాఖ జేడి ఏ చంద్రశేఖర్, ఏడి నాగబాబు తాసిల్దారు కే జి ఎన్ సోమేశ్వరరావు ఎంపీడీవో మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *