Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (PGRS) ప్రజల నుండి అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి రీ ఓపెన్ కు కాకుండా సకాలంలో పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్,ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీ ఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,డి ఆర్ ఓ పెంచల కిశోర్ ల తో కలసి జిల్లా అధికారులు,ఆర్ డి ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, క్వాలిటీ తో సకాలంలో పరిష్కరించాలని,సంబందితా శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజల నుండి అందిన సమస్యలు రిఓపెన్ అయితే సంబందితా శాఖలదికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవిన్యూ డివిజన్ కు సంబంధించి ఆర్ డి ఓ లు అందరు పరసనల్ గా దృష్టి సాధించాలన్నారు.
పిర్యాదు దారుని సంతృప్తి చెందేలా ఇండోస్మెంట్ చేయాలని, మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలన్నారు, పరిష్కరించలేని ఫిర్యాదులకు సంబంధించి ఏ కారణం చేత పరిష్కరం కాలేదు అన్నదాని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలన్నారు, అవసరమైతే అర్జీదారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి, రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలని, కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీ ఓపెన్ అయితాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పి జి ఆర్ ఎస్ కిందిస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేలా తగు శిక్షణ ఇవ్వాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ వార్డు సచివాలయ అధికారిణి సుశీల దేవి, హౌసింగ్ పి.డి వెంకటేశ్వర్ రావు, సి.పి. ఓ వెంకటేశ్వర్లు,సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య, తదితర జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *