Breaking News

మౌలిక సదుపాయాల కల్పించుటకు సంబందితా శాఖలు ప్రణాళికలను సిద్ధం చేయాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని ఎస్ సి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పించుటకు సంబందితా శాఖలు ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ నుండి సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య తో కలసి పంచాయత్ రాజ్, గ్రామీణ నీటి సరఫరా & హౌసింగ్ మొదలైన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 100 రోజుల కార్యాచరణ లో బాగంగా జిల్లాలోని ఎస్ సి గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కు సంబందించి ప్రణాళికను సిద్ధం చేయాలని సంబందితా అధికారులను ఆదేశించారు. ఎస్ సి గ్రామాలలో సి సి రోడ్లు, డ్రైనేజి, సురక్షిత తాగునీరు, గృహాలు,రోడ్లు కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాల కల్పించుటకు జిల్లాల్లో సంబంధిత శాఖలు (పంచాయత్ రాజ్, గ్రామీణ నీటి సరఫరా & హౌసింగ్ మొదలైనవి) ఇప్పటికే ఉన్న ఖాళీలను గుర్తించాలి మరియు కింది వాటిపై యాక్టన్ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సంబందించిన శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, గృ హానిర్మాణం సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *