విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం, విజయవాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.08.10.2024 మంగళవారం నాడు విజయవాడ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం నందు “జాబ్ మేళాలు” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మరియు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. విజయ సారధి మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం అదనపు డైరెక్టర్ గుర్రం పవన్ కుమార్ సంయుక్తంగా తెలియజేసారు.
జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అధ్వర్యంలో ఈ రెండు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. విజయ సారధి మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం అదనపు డైరెక్టర్ గుర్రం పవన్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలిపారు.
ఈ రెండు జాబ్ మేళాలలో ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, గోదావరి ఆంధ్రా కోఆపరేటివ్ సొసైటీ, జీనియస్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, ఇంటిగ్రిటీ హోమ్ సొల్యూషన్స్, AARK సెక్యూరిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెడరల్ స్కిల్ అకాడమీ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని వారు తెలిపారు. మొత్తంగా 156 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 50 మంది ఎంపిక కాగా మిగిలిన వారిలో 35 మంది Shortlisted అయ్యరు అని తేలిపారు.