Breaking News

అక్టోబర్ 14 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 14వ తేదీన యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 14 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున జిల్లా ప్రజలు, అర్జు దారులు ఈ విషయాన్ని గమనించాలని, మీ మీ అర్జీలని క్షేత్ర స్థాయిలో స్థానికంగా అందుబాటులొ ఉండే డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయి అధికారులకి అందచేయాలని కోరారు. ఆర్జి దారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కలెక్టరేట్ వద్ద కు రావద్దని కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *