Breaking News

అభివృద్ధిలో అశ్వారావుపాలెం అగ్రగామిగా నిలవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధిలో అశ్వారావుపాలెం అగ్రగామిగా నిలవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల సందర్భంగా రూ.23.60 లక్షలతో మూడు నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి భూమి పూజ చేశారు. నిజమైన పల్లె పండుగ ప్రజల అపూర్వ స్పందనకు అశ్వారావుపాలెం వేదికగా నిలిచిందన్నారు. ఈ గ్రామంలో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ సభ్యులు కటికల వసంత్, బొప్పన భాను, సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఉప సర్పంచ్ యక్కటి నాగరాజు, పీఆర్ డీఈ సురేష్, ఏఈ బ్రహ్మానందరావు, ఉపాధి పథకం ఏపీఓ రవికుమార్, ఈఓఆర్డి అరుణకుమారి, టిడిపి గ్రామ అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు దాసినేని నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు, సీసీ రోడ్లు మంజూరు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాదును ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *