Breaking News

కేంద్ర ప్రభుత్వ నూతన అక్షరాస్యత కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నూరు శాతం అక్షరాస్యత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నూతన అక్షరాస్యత కార్యక్రమం ఉల్లాస్ (Understanding Lifelong Learning for All in Society)(ULLAS) జిల్లాలో అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం జిల్లా స్థాయి కన్వర్జేన్స్ కమిటీ సమావేశం మంగళవారం డిఆర్ఓ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయబడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలలో లబ్ధిదారులు, ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, ఏయిడెడ్ పాఠశాలల్లో ఆయాలు, వంటవారు, హెల్పర్లు, రాత్రి కాపలాదారులు, అంగన్వాడి హెల్పర్లలో నియో లిటరేట్స్ కొంత చదువు కలిగి ఉన్నప్పటికీ మరచిపోయినవారిని ఈ కార్యక్రమం కింద లబ్ధిదారులుగా గుర్తించి అక్షరాస్యత కల్పించుటకు ఉద్దేశించిన కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమములకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విధంగానే మండల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. కమిటీలో డిఆర్డిఏ బాధ్యతలు వివరిస్తూ స్వయం సహాయక సంఘాలలో విలేజ్ ఆర్గనైజేషన్ సహాయకులు (వివోఏలు) మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ లెర్నర్స్ ను, వాలంటీర్ టీచర్లను గుర్తించాలన్నారు. ఈ గుర్తింపు కార్యక్రమం ఈనెల 16 నుండి 24 వరకు నిర్వహించాలన్నారు. 25న రాష్ట్రస్థాయి, ఈనెల 29న జిల్లాస్థాయి, నవంబర్ 2న మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 1:10 ప్రాతిపదికన వాలంటీర్ టీచర్ : లెర్నర్ లను బ్యాచ్ లుగా చేయాలన్నారు. నవంబర్ 5 నుంచి 2025 మార్చి 15 వరకు అక్షరాస్యత తరగతులు నిర్వహించడం, ఆ తరువాత గ్రామస్థాయిలో అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టవంతంగా అమలు చేయడం ద్వారా నూరు శాతం అక్షరాస్యత సాధించాలని డిఆర్వో సూచించారు.

ఈ కార్యక్రమ నోడల్ అధికారి/కమిటీ సభ్యకన్వీనర్ /జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు హాజీ బేగ్, ఏపీఓ ఏ. అజయ్ కుమార్, ఉప విద్యాశాఖాధికారి శేఖర్ సింగ్, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *