-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సఫాయి కరంచారి కమిషన్, న్యూ ఢిల్లీ చైర్మన్ ఎం.వెంకటేశన్ ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు తిరుపతి జిల్లా మరియు చిత్తూరు జిల్లాలో ‘ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్, 2013’ అమలును సమీక్షించడానికి జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ సఫాయి కరంచారి వారి కమిషన్ చైర్మన్ ఈ నెల 18 వ తేదీన మధ్యాహ్నం 12.30 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి చిత్తూరు జిల్లా కు రోడ్డు మార్గాన చేరుకుని పలు కార్యక్రమాలలో పాల్గోని తిరిగి రాత్రి 8.00 గం.లకు తిరుపతికి విచ్చేసి రాత్రి బస చేస్తారని తెలిపారు. 19 వ తేది ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మరియు సెక్రటరీతో పాటు సంబంధిత సఫాయి కరంచారి నాయకులు మరియు పారిశుధ్య కార్మికులతో సమావేశం తుడా మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు డీన్ మరియు మెడికల్ సూపరింటెండెంట్, శ్రీ వెంకటేశ్వర రాంనారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – (RUIA హాస్పిటల్) మరియు ఇతర సీనియర్ అధికారులతో పాటు సఫాయి కరంచారిల నాయకులు మరియు పారిశుధ్య కార్మికులతో సమావేశం రుయా హాస్పిటల్ మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తారని, సాయంత్రం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) మరియు హాస్పిటల్ డైరెక్టర్-కమ్-వైస్ ఛాన్సలర్, మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఇతర సీనియర్ అధికారులతో పాటు సంబంధిత అధికారులు మరియు సఫాయి కరంచారిల నాయకులతో సమావేశం స్విమ్స్ మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తారని, అనంతరం అదే రోజు రాత్రి తిరుపతి నందు బస చేస్తారని, మరుసటి దినం అనగా 20వ తేదీన ఉదయం 9.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి వారు ఢిల్లీ కి తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News