Breaking News

అక్టోబర్ 17వ తేది (నేడు) జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 17వ తేది (నేడు) గురువారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 17న (నేడు) గురువారం సెలవు దినముగా ప్రకటిస్తూ, ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *