తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రుయా ఆసుపత్రి లో శనివారము పారిశుద్ధ్య కార్మికుల నేషనల్ కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, న్యూఢిల్లీ, నుండి ఈరోజు రుయా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులతో నేరుగా చర్చించి వారి సమస్యల గురించి విరివిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమము రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల గురించి వారి పడుతున్న బాధలు గురించి, ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు , కొంతమంది మహిళలు లేసి గత మూడు నెలలుగా మాకు జీతాలు సరిగా ఇవ్వడం లేదని , సరిగా డ్యూటీలు కూడా మాకు వేయడం లేదని, కమిషన్ ముందు వారి యొక్క సమస్యల గురించి తెలిపారు. కమిషన్ చైర్మన్ వెంటనే ఏ వన్ యాజమాన్యం వారిని పిలిపించి పది రోజుల్లో జీతాలు చెల్లించవలసిందిగా కంటస్వరంతో వినిపించారు. ఏ వన్ కాంట్రాక్టర్ పది రోజుల్లోపు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లిస్తామని తెలిపారు.
ఇకమీదట ఈ.సీ.ఐ, జీ.పీ.ఎఫ్. తదుతరి అంశాలన్నీ కూడా త్వరగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాలని కాంట్రాక్టు కు ఆయన తెలిపారు. వెంటనే నేషనల్ కమిషన్ సఫాయి కర్మ చారి చైర్మన్ ఈ సమస్యలు అన్నిటిని కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహులు తో ఫోన్లో విషయాలన్నీ మాట్లాడారు. డి.ఎం.ఈ వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని, నేషనల్ సఫాయి కర్మ చారి కమిషన్ చైర్మన్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి ఏ ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ కమీషనర్ , లేబర్ చిన్న లాలప్ప, డిప్యూటీ డైరెక్టర్, లైసెన్ ఆఫీసర్ రమణ, రూపేష్, ఏడి దాతేశ్వరీ, ఏవో రమేష్ , ఆఫీస్ సూపెరిటెండెంట్ గిరి ప్రసాద్, పారిశుద్ధ కార్మికులు ఏ వన్ కాంట్రాక్టర్, యాజమాన్యము _ మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో వీర కిరణ్ తదుతరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News