Breaking News

తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ కొరకు ఐఐటీ తదితర పలు యూనివర్సిటీల సబ్జెక్ట్ నిపుణుల సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో జిల్లా గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ఆచరణాత్మక జిల్లా ప్రణాళికలు తయారీలో ఐఐటీ ఐజర్ తిరుపతి తదితర ప్రముఖ యూనివర్సిటీల మరియు పలువురు సబ్జెక్ట్ నిష్ణాతుల సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి అని ఫలవంతమైన జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీకి ఎంతగానో ఉపయోగ పడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం ఏర్పేడు సమీపంలోని ఐఐటి తిరుపతి కాన్ఫరెన్స్ హాల్ నందు ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, తదితర యూనివర్సిటీల సబ్జెక్ట్ నిపుణులతో స్వర్ణాంధ్ర 2047 తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ పై కన్సల్టేటివ్ వర్క్ షాప్ ను నిర్వహించి కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొని మేథో మథనం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా గ్రోత్ రేట్ 15 శాతానికి తగ్గకుండా మన జిల్లా పొటెన్షియల్ గ్రోత్ రేట్ ఉండేలా పలు అంశాలపైన పర్యాటక మరియు ఆతిథ్య రంగం, విద్యా, పరిశ్రమలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రమోషన్, ఎలక్ట్రానిక్ హబ్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లిథియం బ్యాటరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, జిల్లాలోని వెంకటగిరి చీరలు, శ్రీకాళహస్తి కలంకారీ ఎంతగానో ప్రసిద్ది చెందినవని తదితర అంశాలపై నిపుణులు ఇచ్చిన సలహాలు పూర్తి స్థాయిలో ఆచరణాత్మక జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీకిఎంతగానో ఉపయోగ పడతాయని కలెక్టర్ తెలిపారు. మైస్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, లీజర్ టూరిజం, జిల్లాలోని ట్రెక్కింగ్, జలపాతాలు, పులికాట్ లేక్, పులికాట్ బర్డ్ అభయారణ్యంలో ఫ్లెమింగో పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని , నేలపట్టు అభయారణ్యం గ్రే ఫెలికాన్ తదితర వలస పక్షులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయని, ఇరకం దీవి, హిస్టారికల్ చంద్రగిరి కోట వంటివి పర్యాటకంగా ఎంతగానో మెరుగైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

పలువురు నిపుణులు పై అంశాలపై మాట్లాడుతూ ప్రొడక్ట్స్ తయారు చేసిన వాటికి మార్కెటింగ్ లింకేజేస్ ఉండాలని సూచించారు. జిల్లా వెబ్సైట్ లో పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించిన మేరకు మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆతిథ్య రంగంలో కూడా మంచి సేఫ్ హోటల్స్, ప్రభుత్వ పర్యాటక శాఖ అనుబంధంతో ఉంటూ వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటే బాగుంటుందని వారు సూచించారు. అలాగే రైతులకు వ్యవసాయ మెలకువలపై క్షేత్ర స్థాయిలో అందేలా చూస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయంపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ వారికి వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు అందిస్తున్నారని తెలిపారు.

డైరెక్టర్ ఐఐటి మాట్లాడుతు పరిశ్రమల అవసరాలకు సరిపడా టెక్నికల్ నైపుణ్యం ఎందులో అవసరమో వాటిని గుర్తించి అందులో నిపుణులను తయారు చేసేలా ఆ మేరకు కాలేజీలకు పరిశ్రమలకు లింకేజెస్ అవసరం అని అభిప్రాయ పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా పరిశ్రమల అవసరాల మేరకు నిపుణులను తయారు చేయాల్సి ఉంటుందని సూచించారు. అలాగే గ్రామాలు, విద్యా సంస్థలకు లింకేజ్ చేయడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐఐటి అరవింద్ కుమార్ పాండే, రాహుల్ సిరోహి, చంద్రశేఖర్, హేమంత్ కుమార్, ఉమా శంకర్, సత్య సిఎఓ క్రియా యూనివర్సిటీ, నాగరాజు రామారావు విసి మోహన్ బాబు యూనివర్సిటీ, వైస్ ఛాన్స్లర్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉమా, అప్పారావు విసి ఎస్వీ యూనివర్సిటీ, డైరెక్టర్ ఐజర్,అనిల్ కుమార్ ఎస్ఆర్సి ఐఐటి, బలరామన్ ఐఐటీ, ఎస్పిఎంవివి రిజిస్ట్రార్ రజని, డైరెక్టర్ ఐక్యూఎసి త్రిపుర సుందరి, కే త్రిపాఠి ఐఐటి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రణాళికా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *