Breaking News

శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుంది… : దేవినేని అవినాష్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట నాగమయ్య బజారులో అధికార పార్టీ ఆగడాలకు బలైన వైసీపీ సానుభూతిపరుడు గుగ్గిళ్ళ శ్రీను కుటుంబాన్ని వైసిపి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పరామర్శించి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. ఈ  సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు బలైన గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీను మరణాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆర్థికంగా రెండు లక్షలు అందజేయాలని ఆదేశించారని అన్నారు. దేశంలో తమ పార్టీ నాయకుల, కార్యకర్తల యొక్క బాగోగులు చూసుకునే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని కొందరు సీనియర్ నాయకులు వీడిన కార్యకర్తలు ఎక్కడ ధైర్యం కోల్పోకుండా అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటూ ముందుకు వెళ్ళటం అభినందనీయం. పార్టీలోని ప్రతి నాయకుడికి, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్త 2029లో వైసీపీ పార్టీ అధికారమై లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటురి రాజగోపాల్ (చిన్న), ఎంపీపీలు మార్కాపూడి గాంధీ, రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నీసా, కౌన్సిలర్  వట్టెం మనోహర్, నంబూరి రవి, భద్దునాయక్, చౌదవరపు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *