Breaking News

కాలుష్యరహిత నగరానికి చర్యలు తీసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్యం రహిత నగరానికి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ రూమ్ లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనిన తర్వాత అధికారులకు ఆదేశాలిచ్చారు.

త్రాగునీటి సరఫరా, వాడుకనీటి శుద్ధత గురించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ న్యూఢిల్లీ కన్సల్టెన్సీ వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా నగరంలో వాడుక నీటి శుద్ధత, త్రాగునీటి సరఫరా అంశాలపై తీసుకోవాల్సిన చర్యలు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులు నీటి శుద్ధత కోసం తీసుకోవాల్సిన చర్యలోని తీసుకొని విజయవాడ నగరాన్ను కాలుష్యం రహిత నగరంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *