Breaking News

1లక్ష 44 వేలకు పైగా బాధితులకు రూ. 235.72 కోట్లు ఖాతాలలో జమ

-పరిశీలనలో 2,478 ధరఖాస్తులు 476 ధరఖాస్తుల బ్యాంకు ఖాతాల విఫలం…
-ఈనెల 24వ తేదీలోగా ప్రతి బాధితులకు నష్టపరిహారం అందించేలా చర్యలు..
-బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
-జిల్లా ఇన్‌ చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 1 లక్ష 44 వేల 672 మంది బాధితుల ఖాతాల్లో రూ. 235 కోట్ల 72 లక్షల నగదు జమచేయడం జరిగిందని, పెండిరగ్‌లో ఉన్న 2,478 ధరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసకుంటున్నామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్‌ చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా అన్నారు.

అధక వర్షాలు, బుడమేరు వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లింపులపై మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ చార్జ్‌ కలెక్టర్‌ నిధిమీనా, డిఆర్‌వో వి. శ్రీనివాసరావుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో సెప్టెంబర్‌ నెలలో సంభవించిన అధిక వర్షాలు,బుడమేరు వరద ప్రభావంతో జరిగిన నష్టంలో భాగంగా హౌసింగ్‌, ఎయ్‌ఎస్‌ఎంఇ, వాహనాలు, తదితర విభాగాలకు సంబంధించి 1లక్ష 44 వేల 672 మంది వరద ప్రభావిత బాధితులకు 235 కోట్ల 72 లక్షల నగదు లబ్దిదారుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. 179 గ్రామ వార్డు సచివాలయాలలో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన ధరఖాస్తులను పిజిఆర్‌ఎస్‌ ఫ్లడ్‌ మాడ్యూల్‌ లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేయడం జరిగిందన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వీటితో పాటు ఇంకనూ పరిష్కరించవలసిన 2,478 ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా ధరఖాస్తులను పరిష్కరించి అర్హలైన బాధితుల ఖాతాలలో నష్ట పరిహారం చెల్లింపులు చేయనున్నామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఏ ఒక్కరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అర్హలైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందుతుందన్నారు. ఏ ఒక్క బాధిత కుటుంబానికి పరిహారం అందకుండా మిగిలిపోకూడదనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాదర్శకమైన చర్యలు తీసుకున్నామని ఈనెల 24వ తేదిలోపు బాధితుల ఖాతాలలో ఆర్థిక సహాయాన్ని అందించేలా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నష్ట పరిహారం అందించడం జరుగుతుందని జిల్లా ఇన్‌ చార్జ్‌ కలెక్టర్‌ నిధి మీనా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *