Breaking News

అకాల వర్షాలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

-పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
-మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్మవరం చెరువు తోపాటు గోట్లూరు చెరువు, కనగని పల్లి చెరువులు ఏర్లు పొంగిపొర్లుతున్న చెరువుల్ని పర్యవేక్షించిన మంత్రి సత్య కుమార్ కార్యాలయ సిబ్బంది, అలాగే ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి తండాలో వి.అప్పనాయక్ అనే రైతు 5 ఎకరాలలో సాగుచేసిన ద్రాక్ష తోట, దర్శనమల, ఏలుకుంట్ల, ముదిగుబ్బ, నర్సింపల్లిలలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలావరకు పంట నష్టం వాటిలిందని మంత్రి కార్యాలయ సిబ్బంది రాష్ట్ర అభివృద్ధి కొరకై ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదింపులు జరిపి ఈ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం కలగకుండా చూడాలని అధికారులను కోరారు, అలాగే పలుచోట్ల రైతులు సాగుచేసిన పంటలు తీవ్రంగా దెబ్బ తినడంతో, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వారందరికీ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *