Breaking News

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పై ప్రభుత్వాలు చర్చ ఏమిటి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాసనిక ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాసనిక ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ గురువారం విజయవాడలోని కె.ఎల్ రావు భవన్ లో జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గడ్డం బాబి రాజు ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుండి తెలంగాణ నుండి మాదిగ విద్యా వంతులు, మేధావులు రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక కార్యదర్శి పి.కృపాకర్ మాదిగ ఇన్ఫామ్ స్టేట్ ప్రెసిడెంట్ మట్టా విద్యార్థి, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రొఫెసర్ ముత్తయ్య, ప్రొఫెసర్ పెద్దింటి నేహెమ్యా, రాంబాబు, బుట్టి రామచంద్రుడు, చిరంజీవరావు, ముప్పిడి సుబ్బారాయుడు మట్టా ప్రభాత్, తిరుపతి నుండి ప్రొఫెసర్. రవిబాబు మాట్లాడారు, భద్రాచలం నుండి ముద్దా పిచ్చయ్య, కండెల వర ప్రసాద్, వడ్డే ప్రసాద్, కుక్కల వెంకటేశ్వర్లు , గద్దల ఆదాము పాల్గొన్నారు. రిజర్వేషన్లు అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతతో కూడిన పంపిణీ న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే 3 నెలల వ్యవధిలో జ్యూడిషియల్ కమీషన్ నియమించాలని, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో చట్టం చేసి మాదిగ, రెల్లి మరియు అనుబంధ కులాలకు రంగాలలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా వక్తలు రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా పరిగణించి వర్గీకరణ అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్, ప్రొఫెసర్ ముత్తయ్య ఉస్మానియా యూనివర్సిటీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *