Breaking News

అత్యంత క‌చ్చిత‌త్వంతో జాతీయ ప‌శు గ‌ణ‌న‌

– ఈ నెల 25వ తేదీన ప్రారంభంకానున్న స‌ర్వే
– జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 25వ తేదీ శుక్ర‌వారం నుంచి 21వ జాతీయ ప‌శు గ‌ణ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని.. అత్యంత క‌చ్చిత‌త్వంతో గ‌ణాంకాల న‌మోదుకు అధికారులు, సిబ్బందికి ఆదేశాలిచ్చిన‌ట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనా తెలిపారు. గురువారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ నిధి మీనా.. విజ‌య‌వాడ‌లోని జేసీ క్యాంపు కార్యాల‌యంలో ప‌శు గ‌ణ‌న వాల్‌పోస్ట‌ర్లు, నియ‌మావ‌ళి పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించడంతో పాటు గ‌ణ‌న‌క‌ర్త‌ల‌కు ట్రావెలింగ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా నిధి మీనా మాట్లాడుతూ నాలుగు నెల‌ల పాటు ప‌శుగ‌ణ‌న నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని, ఇందుకోసం 241 మంది ప‌శుగ‌ణ‌న‌క‌ర్త‌లు, 47 మంది ప‌ర్య‌వేక్ష‌కుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక గ‌ణ‌న‌క‌ర్త‌ను కేటాయించామ‌ని, 20 మండ‌లాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌శు గ‌ణ‌న జ‌రుగుతుంద‌న్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలోని 7,02,900 కుటుంబాల‌ను స‌ర్వేచేసి గేదెలు, ఆవులు, కోళ్లు, గొర్రెలు, మేక‌లు ఇలా 16 ర‌కాల ప‌శువులు, జీవాల సంఖ్య‌ను లెక్కించి, యాప్‌లో న‌మోదు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప‌శు గ‌ణ‌న ఆధారంగా నిధుల‌తో పాటు వ్యాధినిరోధ‌క టీకాలు, న‌ట్ట‌ల వ్యాధి నివార‌ణ మందులు వంటివి స‌ర‌ఫ‌రా అవుతాయ‌ని ఈ నేప‌థ్యంలో పాడిరైతులు గ‌ణ‌న‌క‌ర్త‌ల‌కు క‌చ్చిత‌మైన వివ‌రాలు అందించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ఎన్‌టీఆర్ జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ సంయుక్త సంచాల‌కులు ఎం.హ‌నుమంత‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *