Breaking News

అర్హులైన ప్ర‌తిఒక్క‌రినీ అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌లో చేర్చండి

– ప‌థ‌కం అమ‌ల్లో రాష్ట్రంలో బ్యాంకుల ప‌నితీరు భేష్‌
– పీఎఫ్ఆర్‌డీఏ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌వేష్ కుమార్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్ర‌తిఒక్క‌రూ అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కంలో చేరేలా బ్యాంకులు కృషిచేయాల‌ని పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌వేష్ కుమార్ అన్నారు.

గురువారం పీఎఫ్ఆర్‌డీఏ-న్యూఢిల్లీ భాగ‌స్వామ్యంతో రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మితి అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌పై విజ‌య‌వాడ‌, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌, ఆహ్వాన్ క‌న్వెన్ష‌న్‌లో అవుట్‌రీచ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి పీఎఫ్ఆర్‌డీఏ సీజీఎం ప్ర‌వేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజ‌రై మాట్లాడారు. అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న అమ‌ల్లో రాష్ట్రంలోని బ్యాంకులు మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తున్నాయ‌ని, గ‌తేడాది దాదాపు 5.61 ల‌క్ష‌ల మందిని ప‌థ‌కం కింద న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇదేవిధమైన ప‌నితీరును మున్ముందుకూడా క‌న‌బ‌రచాల‌ని సూచించారు.

ఎస్ఎల్‌బీసీ క‌న్వీన‌ర్ సీవీఎన్ భాస్క‌ర‌రావు మాట్లాడుతూ 18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న‌వారు ప‌థ‌కంలో చేరొచ్చ‌ని, ఇందులో చేరిన‌వారు 60 ఏళ్ల త‌ర్వాత వారి పెట్టుబ‌డుల‌కు అనుగుణంగా కనీసం వెయ్యి నుంచి 5 వేలు పెన్ష‌న్ అందుకోవ‌చ్చ‌ని, చాలా త‌క్కువ ప్రీమియంతోనే ఈ సౌకర్యం ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో దాదాపు ఏడుకోట్ల మంది ప‌థ‌కంలో చేరార‌ని, అదే విధంగా రాష్ట్రంలో 31 ల‌క్ష‌ల మంది చేరిన‌ట్లు వివ‌రించారు. అర్హులైన ప్ర‌తిఒక్క‌రినీ ప‌థ‌కం కింద చేర్చేందుకు కృషిచేయాల‌ని బ్యాంక‌ర్ల‌కు సూచించారు. ఈ విష‌యంలో బ్యాంకు మిత్రాలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి భాగ‌స్వామ్య పక్షాల‌తో చ‌ర్చించిన అనంత‌రం, ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచిన బ్యాంకులు, బ్రాంచ్ మేనేజ‌ర్లు, ఎల్‌డీఎంలు, బిజినెస్ క‌ర‌స్పాండెంట్లు త‌దిత‌రుల‌ను స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ఎస్ఎల్‌బీసీ కోఆర్డినేట‌ర్లు ఈ.రాజుబాబు, శ్రీనివాస్ దాస్యం, ఎన్‌టీఆర్ జిల్లా ఎల్‌డీఎం కె.ప్రియాంక, నాబార్డు డీజీఎం, బ్యాంకుల రాష్ట్రస్థాయి కంట్రోల‌ర్లు, ఎల్‌డీఎంలు, బ్రాంచ్ మేనేజ‌ర్లు, బ్యాంకు మిత్రాలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *