Breaking News

అక్టోబరు 28 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం అక్టోబరు 28 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, మునిసిపల్, మండల స్థాయి   ప్రజా సమస్యలు పరిష్కార వేదిక లో ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు.  మండల స్థాయి  అధికారులు అందరూ  మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *