Breaking News

శిశిరం చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక లక్ష్మి పురం లోని ఆలపాటి కార్యాలయం లో సోమవారం ఉదయ శిశిరం చిత్రం మోషన్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ఆ విష్కరించారు. కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరి సహ నిర్మాతలు గా సీనియర్ జర్నలిస్టు, వరల్డ్ రికార్డు హోల్డర్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో శిశిరం నూతన చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భం గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రత్నాకర్ గతం లో వీరస్థలి తెనాలి అనే దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను పొందారని, తెనాలి ప్రాంత జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర ఉద్యమం లో తెనాలి వాసుల కీర్తిని చాటారన్నారు. విద్యా వ్యవస్థ పై తీస్తున్న మరో చిత్రం శిశిరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. చైల్డ్ సూపర్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ మాస్టర్ భాను, మాస్టర్ పుష్కర్ , గోము , యామిని, వెంకట్, మధుకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు దర్శకులు రత్నాకర్ తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే వెంకట్ ప్రసాద్, పాటలు సురేంద్ర రొడ్డా, ఆర్ట్ ఎం. వెంకట్, ప్రొడ్యూషన్ ఇంచార్జీ గా ఎం. శ్రీకాంత్ లు వ్యవహరిస్తున్నారని దర్శకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *