Breaking News

కేర్ అండ్ షేర్ పిల్లలు ఉన్నత సస్థాయికి ఎదగాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేర్ అండ్ షేర్ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని, వారితో దీపావళి సంబరాలు జరుపుకున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారము కేర్ అండ్ షేర్ ట్రస్ట్ వారు నిర్వహించిన కేర్ అండ్ షేర్ అనాధ పిల్లలతో దీపావళి సంబరాలు లో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేర్ అండ్ షేర్ పిల్లలందరూ కేంద్ర, రాష్ట్ర, ట్రస్ట్ వారి సహకారంతో ఉన్నతమైన చదువులు చదివి అత్యున్నతమైన స్థానానికి ఎదగి, వారిలో ఒకరు ఇటువంటి కార్యక్రమాలకు తాము విఎంసి కమిషనర్ గా ఎలా ముఖ్య తిధిగా విచ్చేశారో, అలాగే వారు కూడా ముఖ్యఅతిథిగా విచ్చేయాలని. అలా కేర్ అండ్ షేర్ పిల్లలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు.

దీపాల కాంతులతో వెలుగులు నింపుతున్న దీపావళి పండుగను అంగరంగ వైభవంగా ముఖ్యంగా అతి సురక్షితంగా జరుపుకోవాలని, ఆరోగ్యం పట్ల నిశ్రద్ధ వహించకుండా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కేర్ అండ్ షేర్ పిల్లల కోసం తాము ప్రత్యేకంగా వచ్చారని. ఈ కార్యక్రమానికి కమిషనర్ ని ఆహ్వానించిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి కేర్ అండ్ షేర్ పిల్లలతో చిచ్చుబుడ్లు కాల్చి వారితో దీపావళి పండుగను జరుపుకున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు ఇతర కార్పొరేటర్లు. ఈ దీపావళి సంబరాలలో కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *