Breaking News

వరద బాధితులకు పరుపులు, దుప్పటి, గోడ గడియారం కిట్ ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఏలూరు ఫ్లాష్ టీం, విజయవాడ ఫ్లాష్ టీం మరియు రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో న్యాయవాది యర్రంశెట్టి శ్రీనివాసరావు సౌజన్యంతో బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.గురునాధం, ఎపి హై కోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ సురాబత్తుల మల్లేశ్వరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా చేతుల మీదుగా బుడమేరు వరద ముంపు కారణంగా సర్వస్వం కోల్పోయిన ఎల్.బి.ఎస్.నగర్, ప్రకాష్ నగర్, పైపుల రోడ్డు, రాజరాజేశ్వర పేట తదితర ప్రాంత వరద బాధితులకు సుమారు 300 వందల మంది వరద బాధితులకు పరుపులు, దుప్పటి, గోడ గడియారం కిట్ లను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పడవల ఏడుకొండలు, సంపర శ్రీనివాసరావు, పీడియస్ నారాయణ, మల్లి, జనసేన కిరణ్, మేకల వెంకటేశ్వరరావు, వేముల శ్రీనివాస్, ఏలూరు సిటీ 23వ డివిజన్ కార్పొరేటర్ సాంబ, ఏలూరు ఫ్లాష్ టీమ్, విజయవాడ ఫ్లాష్ టీం మమ్మీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *