విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.08.11.2024 అనగా శుక్రవారం నాడు విజయవాడ లోని “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (GPT), Opposite to రమేష్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ITI రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.” నందు “స్కిల్ స్పోక్స్ (ICSTP) డ్రైవ్ ను” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC), జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.
ఈ స్కిల్ స్పోక్స్ (ICSTP) డ్రైవ్ లో, ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ (USHA INTERNATIONAL LIMITED) వంటి ప్రముఖ కంపెనీ వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీలో గల ఉద్యోగాలకు పదోవ తరగతి (పాస్/ ఫెయిల్), ITI (పాస్/ ఫెయిల్), అప్పరెంటిసుషిప్ (Apprenticeship) పూర్తిచేసిన 20 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.15,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 8 న నిర్వహించబోయే ఈ స్కిల్ స్పోక్స్ (ICSTP) డ్రైవ్ కి హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/Skill-Spokes-vjdeast లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు స్కిల్ స్పోక్స్ (ICSTP) డ్రైవ్ కి రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 6305004318 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News