Breaking News

గుంటూరు నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే ఎవరిపైనైనా చర్యలు తప్పవు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక సిబ్బందికి మాత్రమే చెల్లించి రశీదు పొందాలని, దళారులు వసూళ్లకు వస్తే నేరుగా నగర పాలక సంస్థ కాల్ సెంటర్ కి కాల్ (0863-2345103) చేసి ఫిర్యాదు చేస్తే భాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదార్లు వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన వివిధ మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్ల వద్ద నుండి ఆశీలు వసూళ్లకు గతంలో పాటదార్ల గడువు ముగిసినందున, నూతనంగా టెండర్ కం ఓపెన్ ఆక్షన్ ఆమోదం కోసం జిఎంసి స్థాయి సంఘానికి పంపామన్నారు. ఆమోదం వచ్చే వరకు జిఎంసి సిబ్బందే డిపార్ట్మెంట్ వసూళ్లు చేస్తున్నారన్నారు. కావున నగరంలోని నగరపాలక సంస్థకు ఆశీలు చెల్లించే వారు కేవలం నగరపాలక సంస్థ ఐడి కార్డ్ తో, జిఎంసి అధీకృత రశీదు అందించే వారికే ఆశీలు ఇవ్వాలని తెలిపారు. జిఎంసికి చెందిన కొల్లి శారద హోల్ సెల్ కూరగాయల మార్కెట్, పివికె నాయుడు కూరగాయల మార్కెట్, పాల ఆసుపత్రి వద్ద కూరగాయల మార్కెట్, అరండల్ పేట 1వ లైన్ లోని పచ్చ గడ్డి మార్కెట్, సండ్రీస్ మార్కెట్ ల్లో వ్యాపారుల నుండి, పివికె నాయడు మార్కెట్ ఉత్తర, దక్షిణం వైపు ఫెన్సింగ్ లో, వెన్ లాక్ మార్కెట్ లో సైకిల్ స్టాండ్ లు, కొల్లి శారద హోల్ సెల్ కూరగాయల మార్కెట్ వద్ద, ఎన్టీఆర్ బస్టాండ్, కృష్ణా పిక్చర్ ప్యాలెస్ సెంటర్, బండ్ల బజార్ వద్ద, గాంధీ పార్క్ వద్ద, విజ్ఞాన మందిరం రోడ్ లోని, తహసీల్దార్ (వెస్ట్) కార్యాలయం వద్ద, పాల ఆసుపత్రి వద్ద, నాజ్ సెంటర్ వద్ద ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ రుసుములను జిఎంసి సిబ్బందే వసూళ్లు చేస్తున్నారని, ఏ విధమైన దళారులకు ఆశీలు చెల్లించవద్దని కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థ ఆయా ప్రాంతాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో అడ్మిన్ కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని, నగరపాలక సంస్థ నిర్దేశించిన రుసుమును వసూళ్లు చేసి, సంతకం చేసిన రశీదును అందించాలన్నారు. ఆసీలు వసూళ్ళపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రోజువారీ వసూళ్ల వివరాలను అందించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆసీలు వసూళ్లు పై క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *