Breaking News

అప్పుల కోసమే కార్పొరేషన్లు ! అభివృద్ధి కోసం కాదు!!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని అప్పుల తాలూకా వివరాలు పారదర్శకంగా ప్రభుత్వాలు వెల్లడించడం లేదని అనేక కార్పొరేషన్ ఏర్పాటు అప్పుల కోసమే అని అభివృద్ధి కోసం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు, ఛార్టర్డ్ అకౌంటెంట్ నేతి మహేశ్వర రావు వ్యాఖ్యానించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మహేశ్వరరావు మాట్లాడారు. అనేకమంది మేధావులతో కలిసి ఈ ఫోరం ఏర్పాటు చేయడమైందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే పారదర్శకత లేని అంశాలపై ప్రశ్నిస్తామని అవసరమైతే ఆ విషయాలపై కోర్టు కూడా వెళతామని అన్నారు. పార్టీలు విడుదల చేసే మ్యానిఫెఫ్టో లో నిజం ఎంత ఉంది, రాష్ట్ర బడ్జెట్ కి సరిపడా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో విషసంస్కృతి జాఢ్యం తాండవం చేస్తుందని అన్నారు. ఎఫ్ ఆర్ బి ఎం విధించిన అప్పు పరిధి తప్పించుకోవటానికి కార్పొరేషన్లు స్థాపించడం, అప్పులు తేవటం తెచ్చిన అప్పులు దేనికోసం వేచ్చించాము చెప్పకుండా ఉండొచ్చు అనే దురుద్దేశంతో మొదలెట్టిన తంతుని కార్పొరేషన్లు పెట్టడం వంటి వాటి ద్వారా అప్పులు తేవటం అనుకోవచ్చని వివరించారు. ఎఫ్ఆర్ఎంబి 2022-23 రిపోర్ట్ ప్రకారం 1,17,503 కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని, అలానే గ్యారెంటీ లేకుండా తెచ్చిన అప్పులు ఎన్నో తెలియాల్సి ఉందని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా తెచ్చే అప్పుల మీద చర్యలు చేపట్టాల్సిన అత్యున్నత అధికారాలు ఉన్న కాగ్ వివరాలు లేవు అనే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పులపై సందేహాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న అప్పులు దేనికి వాడారు ఎలాంటి పనులకు వాడారు ఎంత ఖర్చు పెట్టారు అనే సమాచారం లేదని అలాగే సంవత్సరాది అకౌంట్స్ కంపెనీ చట్టాల ప్రకారం తయారు చేయలేదని, అయినా బ్యాంకులు ఎందుకు చర్యలు తీసుకోమని అడగటం లేదో అనేక అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు వాటి వివరాలు పారదర్శకంగా లేవన్న సంగతి ఆర్.బి.ఐ మిగతా ఆర్థిక శాఖలకు తెలియదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. వివిధ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల వివరాలలో స్పష్టత లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ లతో లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు, వాటి వినియోగం, వివరాలు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు వంటి పూర్తి సమాచారం అసెంబ్లీలో పెట్టాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను ఎఫ్ ఆర్ బి ఏం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *