Breaking News

Konduri Srinivasa Rao

డాక్టర్ వీజీఆర్ సేవలు అద్వితీయం…

-సామాన్య ప్రజలకు సైతం ఉపయుక్తంగా ‘డయాబెటిస్ అట్లాస్’ -డాక్టర్ వీజీఆర్ కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసలు -ప్రజాడైరీ వార్షికోత్సవంలో డాక్టర్ వీజీఆర్ కు ఘనసన్మానం -సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని డాక్టర్ వీజీఆర్ వెల్లడి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి అందిస్తున్న సేవలు అద్వితీయమైనవని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రజాడైరీ 21వ వార్షికోత్సవ …

Read More »

చేయూత సహాయంతో పేదలకు సేవా కార్యక్రమాలు అభినందనీయం… : యం. రాజుబాబు

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మురికివాడల్లో జీవిస్తున్న ఎంతో మంది చిన్నారులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు కారణమని, ఇటువంటి పేద కుటుంబాలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయని అటువంటి కుటుంబాలలోని చిన్నారుల మోములో చిరునవ్వు కోసం చేయూత సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు. స్థానిక పర్లోవపేట లో జీవిస్తున్న సుమారు రెండు వందల కుటుంబాలకు చెందిన 150 మంది చిన్నారులకు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అల్పాహార …

Read More »

పశుపోషణతో రైతులకు మెరుగైన అదాయం…

-రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ -ఘనంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం -సమాజ సేవలో భాగస్వాములు కావాలని విద్యార్ధులకు పిలుపు -వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అవసరమన్న గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం …

Read More »

పేద‌ల‌కు అండ‌గా ఆరోగ్య‌శ్రీ‌… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

-12 మందికి 3లక్షల 50వేల రూపాయల సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రజారోగ్యానికి వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శనివారం బ్రాహ్మణ విధిలోని దేవదాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 12 మంది లబ్దిదారులకు 3లక్షల 50వేల రూపాయలు (CMRF) చెక్కులను అందచేశారు. చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్య‌శ్రీ‌ని ప్ర‌చారానికివాడుకున్నార‌ని, నేడు జ‌గ‌న‌న్న దాదాపు 2435 వ్యాధుల‌కు ఆరోగ్య‌శ్రీ ద్వారా చికిత్స‌లు …

Read More »

‘సిటిజన్‌ అవుట్‌ రీచ్‌’ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయ‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శ‌నివారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 40 వ డివిజ‌న్ భ‌వానీపురంలో 122, 123 వ స‌చివాల‌యం నుంచి ప్రారంభ‌మైన‌ సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసరావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మితో క‌లిసి పాల్గొన్నారు. సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని …

Read More »

ప్రజల పై పన్నుల భారాలను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తాం… : టీడీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గాంధీనగర్, అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు వినూత్నంగా రిక్షా తొక్కుతూ నిరసన – ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక్క చాన్సు అని గద్దెనెక్కి …

Read More »

గుణదల, బుడమేరు బ్రిడ్జిలను పక్షం రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలచివున్న రెండు బ్రిడ్జిల పనులు 15 రోజుల్లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశపు భవనంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా వున్న పనులను కలెక్టర్ జె.నివాస్, సెంట్రల్ ఎంఎ మల్లాది విష్ణు సమీక్షించారు. నియోజక వర్గంలో , బ్రిడ్జిల నిర్మాణం జరగాల్సి వుందని దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఎస్ఈ సమావేశం దృష్టికి తెచ్చారు. అందులో తుమ్మలపల్లి కళాక్షేత్రం …

Read More »

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్‌ను విడుదల చేసిన జెసి ఎల్. శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతలో ఎటువంటి లోపాలు వుండకూడదని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంప్ కార్యాలయంలో శనివారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈనెల 31వ తేదిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అందుకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నులిపురుగులను నిర్మూలించి ఆరోగ్యవంతమైన పిల్లలను తయారు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్ …

Read More »

జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్…

-శనివారం సాయంత్రం 5 గంటల వరకు 71,593 మందికి కోవిడ్ టీకా అందజేత… -జిల్లాలో ఇంతవరకు 25,92,329 మంది కోవిడ్ టీకా… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషను 1,02,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశారు. ఇందుకోసం 145 కోల్డ్ చైన్ సెంటర్లను అందుబాటులో వుంచారు. శనివారం ఉదయం 10 గంటలకు కేవలం 10 వేల కోవిడ్ టీకాలను వేయడం గమనించిన జిల్లా …

Read More »

ప్రతీ పాఠశాలలోను కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే… : కలెక్టర్ జె. నివాస్

-త్వరలో డివిజన్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలతో పాఠశాలలు నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాధికారులను, ప్రధానోపాధ్యాయలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మరింత పటిష్టంగా అనుసరించే విషయంపై త్వరలో డివిజన్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు, …

Read More »