
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మురికివాడల్లో జీవిస్తున్న ఎంతో మంది చిన్నారులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు కారణమని, ఇటువంటి పేద కుటుంబాలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయని అటువంటి కుటుంబాలలోని చిన్నారుల మోములో చిరునవ్వు కోసం చేయూత సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు.
స్థానిక పర్లోవపేట లో జీవిస్తున్న సుమారు రెండు వందల కుటుంబాలకు చెందిన 150 మంది చిన్నారులకు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ముఖ్య అతిధిగా పాల్గొని చిన్నారులకు ఆహార పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. రాజుబాబు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పిల్లలకు ఎప్పటికప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆయన అన్నారు. జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్త సేకరణ చేసి వారికి అందించి ఆదుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. సంస్థ ద్వారా పేద ప్రజలకు ఎన్నోన్నో సేవా కార్యక్రమాలు చెయ్యడం అలాగే కరోన సమయంలో కూడా ప్రాణాలకు తెగించి చేయూత సభ్యులు మానవతా దృక్పథంతో కోవిడ్ బారినపడిన రోగులకు సేవ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రోగులకు మెడికల్ కిట్లు ఆక్సిజన్ మిషన్లు రోగులకు బాధితుల కుటుంబాలకు ఇంటివద్దకే ఉచిత భోజనం అందించడం, హెచ్ఐవి సోకిన చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ వంటి పలు కార్యక్రమాలు చేపట్టుతున్నటువంటి చేయూత స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలలో పాల్గొనడం, మమ్ములను కూడా భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాజుబాబు అన్నారు. పేద ప్రజలకు చేయూతగా నిలిచే కార్యక్రమాల్లో మావంతు ఆర్థిక సహాయంను ఇకముందు కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. చేయూత సంస్థ నిర్వాహకులు యం రవికుమార్ మాట్లాడుతూ మానవత్వం కలిగిన ఉద్యోగుల ఉపాధ్యాయులతో కలిసికట్టుగా ఏర్పడి పేదవారికి సహాయం చేసే కార్యక్రమాలు చేపట్టాలని చేయూత స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలా మొదలైన చేయూతతో విద్యార్థులకు కూడా తోడై సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. కరోన సమయంలో కూడా సంస్థ సభ్యులు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దివ్యాంగులకు ఆర్థిక సహాయం చేస్తూ జీవన ఉపాధి కొరకు కిరణ షాపులను ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగిందని అన్నారు. ముందు ముందు సంస్థ సభ్యుల సహకారంతో పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. చిన్నారులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనడమే కాకుండా చేయూత సంస్థకు ఆర్థిక సహాయం కూడా అందించినందుకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు కె భద్రాచలం (రాజా) చేయూత సంస్థ సభ్యులు అలీం,నాగేంద్ర, అజహర్ పవన్ కళ్యాణ్, ఖాన్, బాషా, మాధవ్, రాజేష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News