Breaking News

Konduri Srinivasa Rao

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దు… : కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులందరికీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయమని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని అసంఘటిత కార్మికుల వివరాలను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. …

Read More »

స్పందనకు 10 అర్జీలు…

-న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌యవాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమము ద్వారా మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మేయ‌ర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి విభాగం – 1 మొత్తం 10 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు. …

Read More »

స్పందనలో 54 అర్జీల రాక…

-గతవారం వరకు రెవెన్యూ శాఖకు చెందిన 2824 ధరఖాస్తుల్లో నేటి వరకు 2700 పరిష్కారం… -సబ్ కలెక్టర్ జి.ఎస్ఎన్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 64 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి …

Read More »

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్పూర్తిదాయకం…

-సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో …

Read More »

ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-ప్రభుత్వఉద్యోగి ఎవరైనా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే రద్దు చేయడం జరగుతుంది… -ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య పోరాట ఉద్యమం స్పూర్తి రాజకీయ విలువలను భావితరాలకు స్పూర్తి దాయకం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై స్ఫందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. …

Read More »

వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకములో డ్రోన్ ద్వారా రీ సర్వే పనులను ప్రారంభించిన ఆర్డీవో శ్రీనుకుమార్

గుడ్లవల్లేరు, ఆగస్టు,23 :- వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ ద్వారా సహాయంతో రీసర్వే పనులు ప్రారంభించామని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం గుడ్లవల్లేరు మండలం వేమవరప్పాలెం గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే పనులను ఆర్డీవో శ్రీనుకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను  తెలియజేశారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్‌ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారని, వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే …

Read More »

శాసన సభ ప్రాంగణంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు…

-ఘనంగా నివాళులు అర్పించిన శాససభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. శాసన సభ కమిటీ సమావేశ మందిరంలో శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది అంతా సమావేశమై టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా …

Read More »

తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు టంగుటూరి…

-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గొప్ప న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.  బుడితి రాజశేఖర్  ప్రసంగిస్తూ ప్రకాశం పంతులు క్విట్ ఇండియా ఉద్యమం, …

Read More »

సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలి… : యం.రాజుబాబు

-సిపియస్ ఉద్యోగుల ఆందోళనకు రవాణాశాఖ ఉద్యోగుల మద్దతు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపియస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలని కోరుతూ ఫ్యాప్టో సిపియస్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 1వ తేదీన నిర్వహించే నిరశన ర్యాలీ, బహిరంగసభకు రవాణాశాఖ ఉద్యోగుల పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు జోనల్ అధ్యక్షులు యం.రాజుబాబు తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీన సిపియస్ ఉద్యోగులు చేపట్టనున్న నిరశన ప్రదర్శనకు మద్దతుగా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో సోమవారం రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు …

Read More »