Breaking News

Monthly Archives: January 2025

గ్రామ పంచాయతీలు డిజిటల్ విధానంలో పన్ను, పన్నేతర వసూళ్లు చేపట్టాలి

-నూటికి నూరుశాతం డిజిటల్ వసూళ్లు చేపట్టాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు, నీటి పన్నులను, ఇతర వసూళ్ళ ను డిజిటల్ విధానంలో మాత్రమే యు పి ఐ , క్యూ ఆర్ 2, పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌ల ద్వారా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈమేరకు ఉత్తర్వుల్లో గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇంటి …

Read More »

ఎడిబి రహదారి పనుల ను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన కలెక్టరు, జెసి

-భూసేకరణ భూముల ఆక్రమణల తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -కలెక్టరు ప్రశాంతి రాజానగరం / రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ – రాజానగరం ప్రధాన రహదారి మార్గంలో ఏపి రహదారుల అభివృద్ది కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు పూర్తి చెయ్యడం లో మరింత సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ నుంచి బయలుదేరి రాజానగరం, రంగంపేట మండలాల పరిధిలో ఏ డి బి రహదారి పనులను …

Read More »

రహదారి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏ డి బి) నిధులతో చేపట్టిన రహదారి పనులని త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రవేటు పరంగా సేకరణ ప్రక్రియ పై సమగ్రంగా వివరాలు అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , రెవిన్యూ అధికారులతో ఎడిబి రోడ్డు పనులపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ – …

Read More »

ప్రతిపాదిత పనుల విషయంలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందచేయాలి…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జూలై, ఆగష్టు, సెప్టెంబరు నెలలలో వరదలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం ప్రతిపాదిత పనుల విషయంలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం అమరావతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రథాన కార్యదర్శి టీ ఆర్ 27 పై, సీసీఎల్ ఏ కమిషనర్ రీ సర్వే పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జెసి ఎస్ చిన్న రాముడు, డిఆర్వో టి. …

Read More »

జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు ఏపీ బాలికల బృందం

-అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లో ఈ నెల 10 నుండి 14 వరకు జరిగే 68వ జాతీయ హ్యాండ్ బాల్ అండర్ – 17 బాలబాలికల టోర్నమెంట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 16 మంది విద్యార్థినిలు ఎంపికయ్యారు. క్రీడాకారిణుల బృందం బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS., ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినిలకు ఆల్ …

Read More »

10న గుర్తింపు పొందని (అన్ రికగ్నైజ్డ్) ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం

-పాఠశాల విద్యా సంచాలకులు బి.విజయ్ రామరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గుర్తింపు పొందని (అన్ రికగ్నైజ్డ్) ఉపాధ్యాయ సంఘాలతో మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ విద్యాభవన్ లో ఈ నెల 10వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా సంచాలకులు  బి.విజయ్ రామరాజు. వి. IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరు కావాలని, ఉపాధ్యాయ బదిలీలు, జీవో 117కు ప్రత్యామ్నాయం, పదోన్నతులు, ఇతర …

Read More »

రీస‌ర్వేలో క‌చ్చిత‌త్వానికి అత్యంత ప్రాధాన్య‌మివ్వాలి

– ఎలాంటి త‌ప్పిదాల‌కు తావులేకుండా కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా నిర్వ‌హించాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీస‌ర్వేలో క‌చ్చిత‌త్వానికి అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని.. ఎలాంటి త‌ప్పిదాల‌కు తావులేకుండా రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో రెవెన్యూ గ్రామాల్లో రీస‌ర్వేపై వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. పైల‌ట్‌గా ఎంపిక చేసిన ఒక్కో మండ‌లంలోని ఒక్కో గ్రామంలో స‌ర్వే …

Read More »

ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు మరియు రిటైల్ ధరలపై వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్పరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ రెండవ రోజు విజయవాడలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పి. వెంకట రామ రెడ్డిలు విద్యుత్ టారీఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రెండవ రోజు …

Read More »

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.10.01.2025 శుక్రవారం  విజయవాడ లోని “ఏ.పీ.ఎస్.ఎస్.డి.సి[APSSDC] ఎన్టీఆర్ డిస్టిక్ ఆఫీస్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రమేష్ హాస్పిటల్స్ ఎదురుగా, ప్రభుత్వ ITI రోడ్, విజయవాడ, విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా నందు ” కంపెనీ స్పెసిఫిక్ స్పెసిఫిక్ డ్రైవ్ [Company-Specific Drive]” …

Read More »

ఆప్కో చేనేత వస్త్రాలపై 30% శాతం ప్రత్యేక తగ్గింపు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30% శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వడం జరుగుతుందని ఆప్కో మండల వాణిజ్యాధికారి డి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ఆప్కో విక్రయశాలలతో పాటు ఆప్కో హ్యాండ్లూమ్స్.కామ్ అమెజాన్, ప్లిఫ్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలలోను 30 శాతం ప్రత్యేక రాయితీ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించడంతోపాటు, ఆప్కో వస్త్రాలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా తగ్గింపు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. …

Read More »