Breaking News

Monthly Archives: January 2025

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయం పై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేసారు.. ఈ మేరకు శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 3ను విడుదల చేయడంపై మంత్రి దుర్గేష్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వంలో తెలుగు భాషకు సమచిత ప్రాధాన్యం దక్కిందని …

Read More »

కమ్మవారి సేవా సమితి సంక్రాంతి సంబరాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమ్మవారి సేవాసమితి సంక్రాంతి సంబరాలు- 2025 అంగరంగ వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు కిలారు ఫణి తెలిపారు. స్థానిక బందర్ రోడ్డులో ఒక ప్రముఖ హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్మవారు సహజంగా అందరూ సంపన్నులు లుగా ఉన్నత స్థితిలో ఉంటారని, అందరూ అనుకుంటారు కానీ కమ్మ కులస్తులలో బడుగు ,బలహీన, పేదవారు, చాలామంది ఉన్నారు అని, వారి పిల్లలకు విద్యాభ్యాసం కొరకు ఒక హాస్టల్ గంగూరు నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం 30 మంది …

Read More »

సీసీఎల్ఏ ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

-అద్దంకి నియోజకవర్గం భూ సమస్యలను సీసీఎల్ఏ అధికారులకు వివరించిన మంత్రి -అలవలపాడు, గోపాపురం రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరిన గొట్టిపాటి -మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించాలన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గం అయిన అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న కీలక భూ సమస్యలను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సదస్సులో పాల్గొన్న అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఇనాం, ఎస్టేట్ …

Read More »

అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు రూ.3 లక్షల విరాళం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు హైదరాబాద్‌కు చెందిన కొడాలి అజయ్ ఘోష్ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన సీఎం చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్‌తో కలిసి అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష, అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ.1 లక్ష, సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అజయ్ ఘోష్ సీఎంకు అందించారు. అజయ్ ఘోష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

Read More »

గృహ లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వండి

-కేంద్రాన్ని కోరిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ వచ్చే ఐదేళ్లలో శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని, ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేంద్రాన్ని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ది పథకాలను మరింత మెరుగ్గా అమలు …

Read More »

పేదలకు మేలు చేసేలా 22ఏ భూములపై నిషేధం ఎత్తివేత

-ఈనెల 20వ తేదీ నుండి రీ సర్వే తిరిగి ప్రారంభం -ఈసారి పకడ్బందీగా రీ సర్వే -దొంగ పాసు పుస్తకాల స్కాంలో నిందితులైన ఎమ్మార్వోలపై చర్యలు -సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ -ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు మేలు చేసేలా 22 ఏ భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ జిల్లాలో ఎన్నెన్ని భూములు …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు వన్-స్టాప్ హెల్ప్‌లైన్

-ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం.. రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్ – హెల్ప్ లైన్ నంబర్ లాంచ్ చేసిన మంత్రి టీ.జీ భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆహార పరిశ్రమల ప్రోత్సాహక సౌలభ్య వన్-స్టాప్ హెల్ప్‌లైన్ – 04045901100 ను మంత్రి టీజీ భరత్ లాంచ్ చేశారు. …

Read More »

8న ప్రధానమంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం పర్యటన విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ …

Read More »

త్యాగధనుల పోరాట స్ఫూర్తిని మరువకూడదు

-నైతిక విలువలతో యువత ముందుకు సాగాలి -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు -ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో క్యాలెండర్ ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహనీయులు, త్యాగధనుల పోరాట స్ఫూర్తిని ప్రతి భారతీయుడు మరువరాదని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ సహకారంతో ముస్లిం స్వాతంత్ర సమరయోధుల …

Read More »

ప‌ర్యాట‌క అభివృద్ధిలో తొలి అడుగు

-తాటిపూడి రిజ‌ర్వాయ‌రులో సాహ‌స జ‌ల‌క్రీడ‌లు ప్రారంభం -పూర్తిస్థాయి భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌తో బోటింగ్ కు ఏర్పాట్లు -పిపిపి విధానంలో ప‌ర్యాట‌క అభివృద్ధికి చ‌ర్య‌లు : మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ -రిజ‌ర్వాయ‌రు నిర్మాణంలో గొర్రిపాటి బుచ్చి అప్పారావు విశేష‌కృషి విజ‌య‌న‌గ‌రం(తాటిపూడి), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప‌ర్యాట‌క అభివృద్ధిలో తొలి అడుగు ప‌డింద‌ని రాష్ట్ర సెర్ప్‌, చిన్న‌ప‌రిశ్ర‌మ‌లు, ఎన్‌.ఆర్‌.ఐ. వ్య‌వ‌హారాల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. గంట్యాడ మండ‌లంలోని తాటిపూడి రిజ‌ర్వాయ‌రులో ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా సాహ‌స జ‌ల‌క్రీడ‌ల‌ను(Adventure Water Sports) మంత్రి శుక్ర‌వారం ప్రారంభించారు. …

Read More »