Breaking News

Monthly Archives: January 2025

జనవరి 23వ తేదీన కురుబ మహాసభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కురబ మహాసభ జనవరి 23వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని కురుబ రాష్ట్ర అధ్యక్షులు జబ్బలి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుబ కులస్తులు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఉన్నారని రాష్ట్రంలో 20 లక్షలు ఉన్నారని, ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మేము నిర్వహించే భారీ మహాసభ 10,000 మందితో నిర్వహిస్తున్నామని దానికి కేంద్రం నుండి, రాష్ట్రంలో అన్నిరాజకీయ …

Read More »

రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

-RoFR పట్టాలు సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టాలి -అన్ సర్వే ల్యాండ్స్ కు కొత్త నెంబర్లు కేటాయించాలి -మండలాల వారీగా రీ సర్వే చేపట్టాలి -సన్న, చిన్నకారు రైతు భూ సమస్యలను పరిష్కరించాలి -దేవాదాయ భూముల వివరాలు క్రమబద్ధీకరించాలి -కొలుసు పార్థసారధి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ భూములకు RoFR పట్టాలు ఇచ్చినా అటవీ శాఖాధికారులు సాగు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు వెల్లువెత్తుతున్నాయి, వాటిపై ప్రభుత్వం …

Read More »

ఖరీఫ్ 2025 నుండి కొత్తగా అమలుకానున్న డిజిటల్ లైసెన్సు విధానం

-యస్..డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., వ్యవసాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్. -ముఖ్యమంత్రి ఆదేశాలతో డిజిటల్ లైసెన్సు విధానం లో కృతిమ మేధ, డీప్ టెక్ సాంకేతిక వినియోగం -వ్యవసాయ వనరుల క్రయ విక్రయ లైసెన్సు విధానం మరింత సులభతరం. -ముగిసిన టెండర్ల ప్రక్రియ -పారదర్శకతకు పూర్తి అవకాశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి వ్యవసాయ సంచాలకులు కార్యాలయం లో శుక్రవారం యస్ .డిల్లీరావు విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నుండి ప్రారంభంఅయ్యే ఖరీఫ్ సీజన్ నుండి వ్యవసాయ వనరులైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల …

Read More »

ఈనెల 6,7,8, తేదిలలో రాష్ట్ర స్థాయి POLY TECHFEST 2024-25

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులు సాంకేతిక ప్రాజెక్టుల ద్వారా వినూత్నమైన మరియు సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన “POLY TECHFEST 2024-25” స్టేట్ మీట్ ను జనవరి 6, 7 & 8 తేదిలలో మూడు రోజుల పాటు S.S. కన్వెన్షన్‌ హాల్, లబ్బీపేట, విజయవాడలో నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు శ్రీ. G. గణేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’కు మద్దతుగా …

Read More »

బుడమేరు వరదలు పునరావృతం కాకుండా పట్టిష్ట చర్యలు

-గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగర ప్రజలు నష్టపోయారు -బుడమేరు పునర్నిర్మాణానికి అధికారులతో కలసి ప్రణాళికలు సిద్ధం -గత ప్రభుత్వం బుడమేరుకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు -రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడ‌మేరు వరద నియంత్రణ పై విజ‌య‌వాడ ఇరిగేష‌న్ క్యాంప్ ఆఫీస్ లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ, లు ఉన్నతాధికారులతో శుక్రవారం స‌మీక్ష‌ చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఇరిగేష‌న్ స్పెషల్ …

Read More »

నేషనల్ గేమ్స్ కి ఏపీ బాక్సర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించనున్న నేషనల్ గేమ్స్ కి రాష్ట్రం తరఫునుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు ఆంధ్ర ప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దేవ్ తెలిపారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితాలో హెవీ వెయిట్ విభాగంలో(86-92కేజీ ) శివ గణేష్ రెడ్డి( ప్రకాశం జిల్లా), హెవీ వెయిట్ విభాగంలో (92-92+ కేజీ) హేమంత్ కుమార్ రత్నం( శ్రీకాకుళం) లు ఎంపికైనట్లు చెప్పారు. సీనియర్ …

Read More »

జాతీయ వాలీబాల్ పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6 వ తేదీ నుంచి పిబి సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగనున్న 68 వ స్కూల్ గేమ్స్ అండర్19 బాలికల జాతీయ వాలీ బాల్ పోటీలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.పోటీల నిర్వహణ నిమిత్తం గత రెండు రోజుల నుంచి వాలీ బాల్ కోర్టుల నిర్మాణం వేగం గా జరుగుతున్నాయి.జాతీయ పోటీల స్థాయి తగ్గట్టు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు.పోటీల్లో పాల్గొనే వివిధ రాష్ట్రా ల జట్లు శుక్రవారం రాత్రి నుంచే నగరానికి చేరుకొనున్నాయి.క్రీడాకారులు …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 472

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి శుక్రవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ …

Read More »

విద్యార్దులు వారి విన్నూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్దులు వారి విన్నూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఆర్ పి బి ఎస్ జెడ్ పి హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజు వారీ తరగతి …

Read More »

పోర్టులు, ఎయిర్ పోర్టులతో అభివృద్ధికి బాటలు

-7 కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష -గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పైనా రివ్యూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్ పోర్టులను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. …

Read More »