Breaking News

Monthly Archives: January 2025

మీ చెత్త.. మీదే బాధ్యత

-“స్వచ్ఛత సర్వేక్షన్ 2025” రిటర్న్ గిఫ్ట్ 2.0 కార్యక్రమం -వ్యర్థాలను రోడ్డు పై పడవేసినా టీ స్టాల్ కి రిటర్న్ గిఫ్ట్ -ఆల్ఫా రెస్టారెంట్, బాబా టీ స్టాల్ వారి నుండి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుం వసూలు -మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం …

Read More »

ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు నందు జనవరి 5వ తేదీ ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంస్థాగత సామాజిక బాధ్యతగా, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గుండెపోటు, పక్షవాతం వంటి అత్యవసర పరిస్థితుల సమయంలో మొదటి గంటలో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంశాలపై అవగాహన కల్పిస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల లక్షలాది మంది ఈ శిక్షణల ద్వారా ప్రాణాలను రక్షించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ క్రమంలో, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు ప్రాంగణంలో ఉచిత …

Read More »

పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారు… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు. స్థానిక హిందూ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతున్న యువ కెరటాలు కార్యక్రమంలో శనివారం సాయంత్రం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపారు. అనంతరం వివిధ అంశాలలో నిర్వహించిన …

Read More »

భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మంత్రి జిల్లా కలెక్టర్తో కలసి శనివారం స్థానిక లేడీ యామ్థిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో …

Read More »

700 సర్వీస్ ప్రొవైడర్లకు జనవరి 15 నుండి ఉచిత నైపుణ్య శిక్షణ

-శిక్షణ కోసం విజయవాడ నగరపాలక సంస్థ యు.సి.డి విభాగం లో దరఖాస్తు చేసుకోగలరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐ వి పాలస్ నందు ఉదయమ్మ 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లంబర్లు, …

Read More »

షెడ్యూల్ కులాల డ్రాఫ్ట్ లిస్టు లో అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు షెడ్యూల్ కులాల సర్వేపై సామాజిక తనిఖీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ లిస్టును డిసెంబర్ 26, 2024వ తేదీన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ప్రచురించడం జరిగినది, ఇందుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో జనవరి 7, 2025 తారీకు లోపు మీ సంబంధిత సచివాలయాలలో రాతపూర్వకంగా అభ్యంతరములు తెలియజేయవలెను. అభ్యంతరములు అన్ని ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత …

Read More »

మాజీ సైనికుల నూతన జెఎసీ కమిటీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కో ఆర్డినేషనల్‌ కమిటీ (ఎన్‌ఈఎక్స్‌సిసి) జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త కె.నాగరాజుని జేఏసీ ప్రెసిడెంట్‌ గానూ మరి కొంతమంది మెంబర్స్‌గా ఏర్పాటు …

Read More »

పుస్తక పఠనం అలవాటు చేయండి

-తల్లి తండ్రులకు ఆర్పీ సిసోడియా పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తక పఠనం అలవాటు చేసే బాధ్యతను తల్లి తండ్రులు తీసుకోవాలని రెవిన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. పుస్తకాలు మంచి నేస్తాల వంటివని, వాటి సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో శుక్రవారం నిర్వహించిన దక్షిణ పశ్చిమ కవి సమ్మేళనంకు కవి, రచయిత, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిసోడియా విభిన్న …

Read More »

ఆరోగ్యశ్రీ – జగన్‌ బూటకాల చిట్టా

-జగన్‌ హయాంలో ఐదేళ్లలో కేవలం రూ.9,942.04 కోట్ల చెల్లింపులు -ఆసుపత్రులకు రూ.2,221.60 కోట్ల బకాయిలు -ఐదేళ్లలో కేవలం 41 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం -కూటమి ప్రభుత్వంలో 7 నెలల్లోనే 7.61 లక్షల కుటుంబాలకు లబ్ధి -మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని, పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందించిన వైద్య సేవల్లోని వాస్తవాలు …

Read More »

అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకూ- శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకూ ఎక్కడున్నా తెలుగువారంతా ఒకటే

-2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా తెలుగుజాతి నిలవాలన్నదే నా ఆకాంక్ష -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలి -తల్లిని ఎలా గౌరవిస్తామో భాషనూ అలాగే గౌరవించాలి -తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్ -ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం సాధిస్తాం -హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ …

Read More »