-శిక్షణ కోసం విజయవాడ నగరపాలక సంస్థ యు.సి.డి విభాగం లో దరఖాస్తు చేసుకోగలరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐ వి పాలస్ నందు ఉదయమ్మ 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి మరమ్మతులు చేసేవారు పెయింటర్, బ్యూటీషియన్( స్త్రీలైనా, పురుషులైనా) తదితర తగిన నైపుణ్య సాంకేతిక శిక్షణ సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు జీవనోపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం మరియు శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 700 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నరాని, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు విజయవాడ నగరపాలక సంస్థ యు.సి.డి విభాగం లో దరఖాస్తు చేసుకోగలరు కోరారు. వీరందరికీ జనవరి 15 నుండి 31 వరకు ఉచితంగా ప్రభుత్వం వారిచే నైపుణ్య శిక్షణ ఇవ్వటమే కాకుండా ఉపాధి కల్పించనున్నారు అని తెలిపారు. మరిన్ని వివరాలకు జిఎస్ సుజాత 8790233881 పి మంజుల దేవి 7780683789 సంప్రదించాలని అధికారులు సూచించారు.
Prajavartha Online Telugu News