-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు షెడ్యూల్ కులాల సర్వేపై సామాజిక తనిఖీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ లిస్టును డిసెంబర్ 26, 2024వ తేదీన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ప్రచురించడం జరిగినది, ఇందుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో జనవరి 7, 2025 తారీకు లోపు మీ సంబంధిత సచివాలయాలలో రాతపూర్వకంగా అభ్యంతరములు తెలియజేయవలెను. అభ్యంతరములు అన్ని ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత విచారణ చేయించి తుది జాబితాను జనవరి 17, 2025న ప్రచురించడం జరుగుతుందని తెలియజేయడమైనదిని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం నాడు విడుదల చేసిన ప్రకటన లో తెలిపారు.
Prajavartha Online Telugu News