Breaking News

Daily Archives: May 15, 2026

బడిలో అడుగు.. జీవితానికి వెలుగు

– జిల్లాలో ఉత్సాహంగా బ‌డి పిలుస్తోంది కార్య‌క్ర‌మం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి చిన్నారి విద్యాభ్యాసం ద్వారా ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని, పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి జి.కొండూరు మండ‌లం, కుంట‌ముక్క‌ల గ్రామంలో జ‌రిగిన బ‌డి పిలుస్తోంది కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. బ‌డిలో చేరిన చిన్నారుల‌తో ముచ్చ‌టించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఎంపీయూపీ, జెడ్‌పీ …

Read More »

అచ్చ ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి శ్రీకారం

-అంగన్వాడీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాల అసలైన బలస్తంభాలు -తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిన ఆవశ్యకత ఉంది -స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలి -మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రలో చిన్నారుల చదువులు (అచ్చ) ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి తెలిపారు. స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ …

Read More »

నేటి జలధార.. రేపటి జీవనాధార..

– రుద్రవరం పెద్ద చెరువులో ముమ్మరంగా పునరుద్ధరణ పనులు – అన్నదాతలకు సాగునీటి భరోసా కల్పించేలా ముందస్తు కార్యాచరణ – రూ. 9,61,206 వ్యయ అంచనాలతో నీటి సంరక్షణ చర్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముందస్తు కార్యాచరణే అభివృద్ధికి పునాది.. నేటి జాగ్రత్త.. రేపటి సురక్షిత భవిష్యత్! అందుకే దార్శ‌నిక ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన జ‌ల‌ధార‌.. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం ఎన్‌టీఆర్ జిల్లాలో విజ‌య‌వంతంగా ముందుకెళ్తోంది. నేటి నీటి సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు.. భ‌విష్య‌త్తులో సిరిసంప‌ద‌ల‌కు నెల‌వుల‌నే దాన్ని …

Read More »

ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ప్ర‌త్యేక పీజీఆర్ఎస్

-ఒక నెల‌-ఒక గ్రామం-నాలుగు సంద‌ర్శ‌న‌లు కార్య‌క్ర‌మం కూడా -ప్ర‌జా స‌మ‌స్య‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి ప్ర‌ణాళికాయుత చొర‌వ‌ -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని, వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం, జి.కొండూరు మండ‌లం, కుంట‌ముక్క‌ల గ్రామంలో ప్ర‌త్యేక పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంతో పాటు …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం ఉదయం సితార గ్రౌండ్స్, విద్యాధరపురంలో ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ …

Read More »

క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ప్రత్యేక శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ హాలు లో నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీలు, వార్డు అమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం వద్దేట కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా …

Read More »

పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరల పెంపును ఖండిస్తున్నాం

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను పెంచడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.3.29, డీజిల్ పై రూ.3.14, కిలో సిఎన్జి గ్యాస్ పై రూ.2 …

Read More »

బీజేపీ నేత మాధవ్‌కు అధికారిక ఆహ్వానాలా?

-అధికార కార్యాలయాల్లో సకల మంత్రిగా లోకేశ్ ఫోటోలా ? -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సూటి ప్రశ్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, అధికార యంత్రాంగాన్ని తమ రాజకీయ పక్షాల సొంత జాగీరులా వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఎలాంటి హోదా లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను ప్రభుత్వ అధికారిక …

Read More »